Covid-19 Parties: కరోనావైరస్ సోకిన వ్యక్తికి పెద్ద గిఫ్ట్ ఇస్తారట
కోవిడ్ 19 ( Covid 19 ) అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వణికిపోతున్నారు. తమకు కరోనావైరస్ సోకకుండా వారు జాగ్రత్తపడుతున్నారు. అదే సమయంలో కొంత మంది మాత్రం కోరి మరీ కరోనావైరస్ అంటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని అలబామా యూనివర్సిటీ ( Alabama University ) కి చెందిన కొంత మంది కాలేజీ విద్యార్థులు కోవిడ్ 19 పార్టీలు ( Covid 19 Party ) నిర్వహించారు. ఈ పార్టీలో చేరాలి అంటే ఉన్న ఒకే ఒక్క రూల్ కరోనావైరస్ అంటించుకోవడం. ఎవరికైతే తొందరగా కరోనావైరస్ సోకుతుందో వారే విజేత. ఇలా వింతగా అనిపించే ఈ పార్టీలో మరెన్నో వింత రూల్స్ కూడా ఉన్నాయి. కరోనావైరస్ ( Coronavirus) సోకిన వ్యక్తికి పెద్ద గిఫ్ట్ ఇస్తారట. కోవిడ్ 19 పార్టీకి వెళ్లిన వాళ్లు తమకు తోచినంత మొత్తాన్ని అక్కడే ఉన్న హుండీలో వేయాలి. Also Read :IRCTC Rajdhani Express: Timing: రాజధాని రైళ్ల టైమింగ్‌లో మార్పు..కొత్త టైమ్ టేబుల్ ఇదే
పార్టీలో జనాలు జల్సా చేసుకుంటున్న సమయంలో ఎవరికీ తెలియకుండా ఒక కరోనావైరస్ సోకిన వ్యక్తిని జనం మధ్యలోకి పంపిస్తారు. అతని నుంచి ఎవరు అయితే ముందు కరోనా వైరస్ సోకేలా జాగ్రత్తపడతారో వారే విజేత. హుండీలో ఉన్న డబ్బు అంతా వారికే సొంతం అవుతుంది. అయితే ఈ పార్టీ గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కొంత మందిని అదుపులో తీసుకున్నారు. ఇలాంటి పార్టీలు రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో వైపు ఇలాంటి తెలివి తక్కువ ఐడియాస్‌తో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..